Yadadri Bhuvanagiri: యాదాద్రి జిల్లాలో విషాదం.. ఇద్దరు చిన్నారులను చంపి తల్లి ఆత్మహత్య!

Yadadri Bhuvanagiri: ఇద్దరు చిన్నారులను చంపి.. తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా గొల్లగూడెంలో చోటుచేసుకుంది.

Update: 2026-03-03 06:03 GMT

Yadadri Bhuvanagiri: యాదాద్రి జిల్లాలో విషాదం.. ఇద్దరు చిన్నారులను చంపి తల్లి ఆత్మహత్య!

Yadadri Bhuvanagiri: ఇద్దరు చిన్నారులను చంపి.. తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా గొల్లగూడెంలో చోటుచేసుకుంది. ఐశ్వర్య అనే మహిళ తన ఇద్దరు చిన్నారులను హతమార్చి, అనంతరం తాను ఆత్మహత్యకు పాల్పడింది. గత కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య తీవ్ర మనస్పర్ధలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఐశ్వర్య తన భర్తతో కలిసి వేములకొండ గ్రామంలో నివాసముండేది. నిన్న సాయంత్రం ఆమె గొల్లగూడెంలోని తన తల్లి ఇంటికి వచ్చి ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తుంది.

రెండేళ్ల బాబు, ఏడాది పాపను హతమార్చి అనంతరం తాను ఆత్మహత్య చేసుకోవడం స్థానికులను కలచివేసింది. చిన్నారుల మృతదేహాలను చూసి గ్రామస్తులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ కలహాలే ఈ దారుణానికి కారణమా? లేక మరేదైనా కారణాలున్నాయా? అన్న దానిపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు.

Tags:    

Similar News