Harish Rao: ప్రజలకు ఒక న్యాయం.. ముఖ్యమంత్రి అల్లుడికి, మంత్రులకు ఒక న్యాయమా?
Harish Rao: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ మైనింగ్, రియల్ ఎస్టేట్ మాఫియాకు అడ్డాగా మారిందని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Harish Rao: ప్రజలకు ఒక న్యాయం.. ముఖ్యమంత్రి అల్లుడికి, మంత్రులకు ఒక న్యాయమా?
Harish Rao: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ మైనింగ్, రియల్ ఎస్టేట్ మాఫియాకు అడ్డాగా మారిందని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజేంద్రనగర్ మానస హిల్స్ ప్రాంతంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన.. రాఘవ కన్‌స్ట్రక్షన్స్ ఎలాంటి అనుమతులు లేకుండా కొండలను పిండి చేస్తూ అక్రమ క్వారీయింగ్ నిర్వహిస్తోందని ఆయన ఆరోపించారు. దీనిపై ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. పేదల ఇళ్లను కూల్చే హైడ్రా బుల్డోజర్లకు, మంత్రులు, వారి బంధువులు చేస్తున్న ఈ భూకబ్జాలు, అక్రమ క్వారీలు ఎందుకు కనిపించడం లేదన్నారు. సామాన్యులకు ఒక న్యాయం, మంత్రులకు ఒక న్యాయమా అని నిలదీశారు.
సీఎం రేవంత్ రెడ్డి తన అల్లుడి అనుయాయులకు ఎలాంటి ఓపెన్ బిడ్డింగ్ లేకుండా 17 ఎకరాల ప్రభుత్వ భూమిని నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టారని, దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు కోట్లలో నష్టం వాటిల్లిందని ఆరోపించారు. మంత్రి పొంగులేటి సంస్థపై తక్షణమే చర్యలు తీసుకుని, అక్రమ క్వారీని మూసివేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. సీఎం అల్లుడి అనుయాయులకు కేటాయించిన 17 ఎకరాల భూమిని రద్దు చేసి, పారదర్శకంగా ఓపెన్ బిడ్డింగ్ నిర్వహించాలని పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే స్వయంగా తానే వెళ్లి క్షేత్రస్థాయిలో నిజానిజాలు నిగ్గు తేలుస్తానని హరీష్ రావు హెచ్చరించారు.