ఇవాళ తెలంగాణలో కేంద్రమంత్రి అమిత్‌‌షా పర్యటన.. బీజేపీ బూత్‌ కమిటీ అధ్యక్షులు, సోషల్‌ మీడియా వారియర్స్‌తో భేటీ

Amit Shah: బీజేపీ బూత్‌ కమిటీ అధ్యక్షులు, సోషల్‌ మీడియా వారియర్స్‌తో భేటీ

Update: 2024-03-12 04:12 GMT

ఇవాళ తెలంగాణలో కేంద్రమంత్రి అమిత్‌‌షా పర్యటన.. బీజేపీ బూత్‌ కమిటీ అధ్యక్షులు, సోషల్‌ మీడియా వారియర్స్‌తో భేటీ 

Amit Shah: లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీ టార్గెట్‌గా బీజేపీ అగ్రనేతలు పావులు కదువుతున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇవాళ తెలంగాణలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట 20 నిమిషాలకు అమిత్‌‌షా బేగంపేట విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి ఇంపీరియల్ గార్డెన్స్ చేరుకుంటారు. పార్టీ బూత్ కమిటీ అధ్యక్షులు, బీజేపీ సోషల్ మీడియా వారియర్స్‌తో భేటీ అవుతారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశా నిర్దేశం చేయనున్నారు.

మధ్యాహ్నం ఎల్బీ స్టేడియంలో విజయసంకల్ప సమ్మేళనంలో అమిత్‌‌షా పాల్గొంటారు. రాష్ర్ట వ్యాప్తంగా ఉన్న పోలింగ్ బూత్ కమిటీ అధ్యక్షులు, ఇంఛార్జీలు, ఇతర నాయకులు కలిపి దాదాపు 50 నుంచి 60 వేల మంది వరకు ఈ సమ్మెళనానికి హాజరవుతారని అంచనా వేస్తున్నారు. సమ్మేళనం అనంతరం ఐటీసీ కాకతీయ హోటల్‌లో పార్టీ ముఖ్యనేతలతో భేటీ అవుతారు. సాయంత్రం 6 గంటల పది నిమిషాలకు బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ తిరుగు ప్రయాణం కానున్నారు.

Tags:    

Similar News