కేంద్రం కీలక నిర్ణయం.. హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీలతకు Y+ సెక్యూరిటీ
Y Plus Category Security: హైదరాబాద్ లోక్ సభ స్థానం నుంచి అసదుద్దీన్ పై పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి మాధవీలతకు కేంద్రం వై ప్లస్ సెక్యూరిటీ కల్పించింది.
కేంద్రం కీలక నిర్ణయం.. హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీలతకు Y+ సెక్యూరిటీ
Y Plus Category Security: హైదరాబాద్ లోక్ సభ స్థానం నుంచి అసదుద్దీన్ పై పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి మాధవీలతకు కేంద్రం వై ప్లస్ సెక్యూరిటీ కల్పించింది. వీఐపీ సెక్యూరిటీలో భాగంగా 11 మందితో భద్రత కల్పించింది. ఆరుగురు సీఆర్పీఎఫ్ పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్లు ఆమె వెంట ఉండగా, ఐదుగురు గార్డులు ఆమె నివాసం వద్ద సెక్యూరిటీగా ఉండనున్నారు.
అయితే మాధవీలతకు సెక్యూరిటీ అంశం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది. తనకు సెక్యూరిటీ కల్పించాలని రాజాసింగ్ పలుమార్లు కేంద్ర హోం శాఖకు లేఖ రాసినా రెస్పాన్స్ రాలేదు. బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో దాడులు జరిగిన సందర్భంలో..ఆయనకు కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలని కార్యకర్తలు కోరినా సెక్యూరిటీ ఇవ్వలేదు. ఈ ఇద్దరి నేతలకు భద్రత కల్పించని కేంద్రం..మాధవీలతకు వై ప్లస్ సెక్యూరిటీ కల్పించడం చర్చకు దారి తీసింది.