Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళల మృతి, మరో నలుగురికి తీవ్ర గాయాలు
Road Accident: మామిడికాయల లోడ్‌తో వెళ్తు్న్న వ్యాన్ పంచర్ కావడంతో బోల్తా
Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళల మృతి, మరో నలుగురికి తీవ్ర గాయాలు
Road Accident: జగిత్యాల జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం ఇద్దరు కూలీలు మృత్యువాతపడ్డారు. కరీంనగర్ - జగిత్యాల జాతీయ రహదారిపై పూడూరు సమీపంలో మామిడికాయ లోడుతో వస్తున్న వ్యాన్ పంచర్ కావడంతో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్రంగా గాయపడి ఆస్పత్రి పాలయ్యారు. మృతులిద్దరూ మధ‌్యప్రదేశ్ కు చెందిన వారని గుర్తించారు. కూలీకోసం వెళ్లిన సునీత, మమత ప్రాణాలు కోల్పోయారని కుటుంబీకుల రోధనలు మిన్నంటాయి.