Visakhapatnam: విశాఖ కిడ్నీ రాకెట్‌ కేసులో మరో ఇద్దరు అరెస్టు

Visakhapatnam: కిడ్నీ శస్త్రచికిత్సచేసిన డాక్టర్ రాజశేఖర్‌ పెరుమాళ్ల,.. మధ్యవర్తి వెంకటేష్‌ను రిమాండ్‌కు తరలించిన పోలీసులు

Update: 2023-05-04 03:59 GMT

Visakhapatnam: విశాఖ కిడ్నీ రాకెట్‌ కేసులో మరో ఇద్దరు అరెస్టు

Visakhapatnam: విశాఖలో సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్‌ కేసులో పెందుర్తి పోలీసులు మరో ఇద్దరు కీలక నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పెందుర్తి శ్రీతిరుమల ఆసుపత్రిలో బాధితుడు వినయ్‌కుమార్‌కు కిడ్నీ తొలగింపు శస్త్రచికిత్స చేసిన డాక్టర్ రాజశేఖర్‌ పెరుమాళ్ల, కిడ్నీ మార్పిడి ప్రక్రియలో కీలకంగా వ్యవహరించిన మధ్యవర్తి వెంకటేష్‌‌ను అరెస్టు చేసి.. రిమాండ్‌కు తరలించారు. ఈ కేసుకు సంబంధించి ఆసుపత్రి యజమాని పరమేశ్వరరావు సహా మరో ఆరుగురిని గతంలోనే అరెస్టు చేశారు.

చెన్నైకి చెందిన కిడ్నీ శస్త్రచికిత్స నిపుణుడు డాక్టర్‌ రాజశేఖర్‌ హైదరాబాద్‌లోని పలు కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందిస్తుంటారు. అనధికార కిడ్నీ మార్పిడి ముఠా ప్రణాళిక ప్రకారం ఆయన పెందుర్తి వచ్చి వినయ్‌కుమార్‌కు శస్త్రచికిత్స చేసి కిడ్నీ తొలగించినట్లు పోలీసులు గుర్తించారు. తొలగించిన కిడ్నీని ఛత్తీస్‌గఢ్‌కు చెందిన చౌహాన్‌ అనే వ్యక్తికి అమర్చినట్లు దర్యాప్తులో తేలింది. నిందితుడు వెంకటేష్‌ కాకినాడ సమీప కరపకు చెందిన వ్యక్తి. 

Tags:    

Similar News