Hyderabad: హైదరాబాద్ నీలోఫర్ ఆస్పత్రిలో ఇద్దరు చిన్నారులు మృతి

Hyderabad: నర్సు ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాతే పిల్లలు చనిపోయారని తల్లిదండ్రుల ఆరోపణ

Update: 2022-03-02 08:08 GMT

హైదరాబాద్ నీలోఫర్ ఆస్పత్రిలో ఇద్దరు చిన్నారులు మృతి

Hyderabad: నీలోఫర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు చిన్నారు చనియారు. ఈరోజు ఉదయం నర్సు ఇద్దరు చిన్నారులకు ఇంజెక్షన్ ఇచ్చిన కాసేపటికే చిన్నారులు చనిపోయారు. నర్సు ఇంజెక్షన్ ఇవ్వడం వల్లనే తమ పిల్లలు చనిపోయారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అయితే చిన్నారులు ఆస్పత్రికి వచ్చే సరికే ఆరోగ్యం క్షీణించిందని వైద్యులు చెప్తున్నారు.

ఒక చిన్నారిని ఫిబ్రవరి28 వ తేదీన నాగర్ కర్నూల్ నుంచి ఇక్కడికి నీలోఫర్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. కేజి బరువు తో7వ నెలలో పుట్టిన చిన్నారి ఆరోగ్యం క్షీణించడంతో నీలోఫర్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఈరోజు తెల్లవారుజామున సుమారు 6 గంటల సమయంలో ఆ చిన్నారి మృతి చెందింది. చిన్నారిని ఆస్పత్రికి తీసుకుని వచ్చి నప్పటి నుంచి ఆక్సిజన్ అందజేస్తున్నామని వైద్యులంటున్నారు. వైద్యుల నిర్లక్ష్యమే చిన్నారుల మృతికి కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

Tags:    

Similar News