ఆర్టీసీని బతికించుకోవడమే మా లక్ష్యం

-ఆర్టీసీ కార్మిక సంఘాల అఖిలపక్ష సమావేశం ప్రారంభం -ఆర్టీసీ కార్మిక సంఘాల అఖిలపక్ష సమావేశం ప్రారంభం -టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అధ్యక్షతన మీటింగ్ -అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించిన ఆర్టీసీ జేఏసీ -హాజరైన సీపీఐ, సీపీఎం, టీడీపీ, జనసేన నాయకులు -భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్న కార్మికులు

Update: 2019-10-09 07:20 GMT

సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. కార్మికుల డిమాండ్లు, ప్రభుత్వ తీరుపై తెలంగాణ జనసమితి కోదండరామ్ అధ్యక్షతన ఆల్ పార్టీ మీటింగ్ కి పిలుపునిచ్చింది. తమ సమ్మెకు మద్దతివ్వాలని అన్ని పార్టీలను ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కోరింది. ఈ నేపథ్యంలో సీపీఎం నుంచి తమ్మినేని, సీపీఐ నుంచి సుధాకర్, టీడీపీ నుంచి రావుల, న్యూడెమోక్రసీ నుంచి పోటు రంగరావు, జనసేన నుంచి శంకర్ గౌడర్ సమావేశానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా అశ్వత్థామ రెడ్డి మాట్లాడుతూ...రాష్ట్ర విభజన అనంతరం ఆర్టీసీలో ఒక్క నియామకం జరగలేదన్నారు. ప్రభుత్వం స్పందంచకుంటే తెలంగాణ వ్యాప్తంగా బంద్‎కు పిలుపు నిస్తామని తెలిపారు. తాము జీతాల కోసం సమ్మె చేయడంలేదని ఆర్టీసీని బతికించుకోవడమే తమ లక్ష్యమని వ్యాఖ్యానించారు. ఆర్టీసీపై డీజీల్ భారం పేరిగిందని, 27శాతం పన్ను విధిస్తున్నారని, కార్మికుల పీఎఫ్ డబ్బులు కూడా తిరిగి ఇవ్వడం లేదని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు తమకు మద్దతు తెలుపుతున్నారని అశ్వత్థామ రెడ్డి పేర్కొ్న్నారు. అఖిలపక్ష సమావేశం తర్వాత ఆర్టీసీ కార్మిక జేఏసీ తమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనుంది.

Tags:    

Similar News