TSRTC: ఉక్రెయిన్ విద్యార్థులకు టీఎస్ ఆర్టీసీ ఫ్రీ సర్వీస్

TSRTC: సజ్జనార్ ఆఫర్ పై నెటిజన్ల మిక్స్ డ్ రెస్పాన్స్

Update: 2022-02-28 08:50 GMT

ఉక్రెయిన్ విద్యార్థులకు టీఎస్ ఆర్టీసీ ఫ్రీ సర్వీస్

TSRTC: ఉక్రెయిన్ నుంచి వస్తున్న విద్యార్థులను తెలంగాణలో వాళ్ల సొంత ఊళ్లకు వెళ్లడానికి ఆర్టీసీ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసిందని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ప్రకటించారు. శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ విమానాశ్రయంలో దిగిన తరువాత ఉక్రెయిన్ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందీ కలగకుండా వారివారి సొంత ఊళ్లకు ఉచితంగా తరలించే ఏర్పాట్లు చేశామని ట్విట్టర్ వేదికగా ఆయన తెలిపారు.

అయితే సజ్జనార్ ఏర్పాట్లపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైంది. విద్యార్థుల పేరెంట్స్ ఆ మాత్రం ఏర్పాట్లు చేసుకోగలరని, వారికోసం ప్రజాధనాన్ని ఇలా పాడు చేయాల్సిన పనిలేదని కొందరు సూచించగా ఇలా ఉన్నవాళ్లకు అనవసరంగా సొమ్ము వెచ్చించే కన్నా ఆర్టీసీలో ఉన్న కొన్ని ఏజెన్సీలు ఔట్ సోర్సింగ్ వర్కర్లను శ్రమ దోపిడీ చేస్తున్నాయని, అలాంటివారికి న్యాయం చేయాలని కొందరు చెబుతున్నారు. మరికొందరేమో సజ్జనార్ ఎప్పుడూ ప్రజాకోణంలో ఆలోచిస్తారని, మంచి నిర్ణయాలు తీసుకుంటారని ప్రశంసలు కురిపిస్తున్నారు.

Tags:    

Similar News