Dharmapuri Arvind: ఎంపీ అర్వింద్ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడి
*ఆందోళనచేస్తున్నవారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Dharmapuri Arvind: ఎంపీ అర్వింద్ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడి
Dharmapuri Arvind: బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటిని టీఆర్ఎస్ కార్యకర్తలు ముట్టడించారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసాన్నిముట్టడించి ఇంటిలోని అద్దాలు, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. ఎమ్మెల్సీ కవితపై ఎంపీ ధర్మపురి అర్వింద్ అనుచిత వ్యాఖ్యలు చేశారని టీఆర్ఎస్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఎంపీ ఇంటి ముట్టడికి వెళ్లిన టీఆర్ఎస్ కార్యకర్తలను అడ్డుకునేందుకు పోలీసులు యత్నించారు. ఘటన జరిగిన సమయంలో ఎంపీ అర్వింద్ హైదరాబాద్‌లో లేరు. నిజామాబాద్‌లో కలెక్టరేట్‌లో నిర్వహించిన దిశ సమావేశంలో ఆయన ఉన్నారు. హైదరాబాద్‌లో టీఆర్ఎస్ కార్యకర్తల దాడి నేపథ్యంలో నిజామాబాద్‌లో ఎంపీ ఇంటి వద్ద పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు.