Maloth Kavitha: ఎంపీ కవితకు హైకోర్టులో ఊరట
Maloth Kavitha: టీఆర్ఎస్ ఎంపీ మాలోత్ కవితకు హైకోర్టులో ఊరట లభించింది.
Maloth Kavitha: ఎంపీ కవితకు హైకోర్టులో ఊరట
Maloth Kavitha: టీఆర్ఎస్ ఎంపీ మాలోత్ కవితకు హైకోర్టులో ఊరట లభించింది. ఇటీవల ప్రజాప్రతినిధుల కోర్టు ఇచ్చిన తీర్పుపై హైకోర్టు స్టే ఇచ్చింది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్లకు డబ్బు పంచారన్న కేసులో ఎంపీ కవితపై 2019లో బూర్గంపహాడ్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. దీనిపై విచారణ చేపట్టిన ప్రజాప్రతినిధుల కోర్టు ఎంపీ కవితకు ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.10వేలు జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది. ప్రజాప్రతినిధుల కోర్టు తీర్పును సవాల్ చేస్తూ కవిత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కవిత పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ప్రజాప్రతినిధుల కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే మంజూరు చేసింది. కోర్టు తీర్పు అమలు నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు తీర్పుతో ఎంపీ కవితకు ఊరట కలిగినట్టయింది.