Jagtial Road Accident: కొండగట్టు వద్ద టవేరా కారు బోల్తా.. 14 మందికి గాయాలు
Jagtial Road Accident: జగిత్యాల జిల్లా కొండగట్టు సమీపంలో టవేరా కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 14 మందికి గాయాలు కాగా, ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
Jagtial Road Accident: కొండగట్టు వద్ద టవేరా కారు బోల్తా.. 14 మందికి గాయాలు
Jagtial Road Accident: జగిత్యాల జిల్లా కొండగట్టు సమీపంలో మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. టవేరా కారు అదుపు తప్పి కల్వర్ట్ వద్ద బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న మొత్తం 14 మందికి గాయాలు కాగా, అందులో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మరో తొమ్మిది మందికి స్వల్ప గాయాలు అయ్యాయి.
ఘటనను గమనించిన స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. బ్రేక్ ఫెయిల్ కావడంతోనే ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.