Revanth Reddy Davos Visit: దావోస్‌లో సీఎం రేవంత్‌రెడ్డి.. పెట్టుబడులపై పారిశ్రామికవేత్తలతో భేటీ
వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వార్షిక సదస్సులో పాల్గొనేందుకు సీఎం రేవంత్‌రెడ్డి దావోస్ చేరుకున్నారు. తెలంగాణ రైజింగ్ 2047 రోడ్ మ్యాప్‌ను పరిచయం చేయనున్నారు.
Revanth Reddy Davos Visit: దావోస్‌లో సీఎం రేవంత్‌రెడ్డి.. పెట్టుబడులపై పారిశ్రామికవేత్తలతో భేటీ
Revanth Reddy Davos Visit : దావోస్‌లో సీఎం రేవంత్ పర్యటిస్తున్నారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వార్షిక సదస్సులో పాల్గొనేందుకు సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలోని ప్రతినిధుల బృందం స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్ నగరానికి చేరుకుంది. వారికి విమానాశ్రయంలో ప్రవాస తెలంగాణవాసులు ఘన స్వాగతం పలికారు. దావోస్‌లో నాలుగు రోజుల పాటు జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాల్లో సీఎం రేవంత్ పాల్గొననున్నారు. మొదటి రోజు వివిధ రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తలతో జరిగే సమావేశాల్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్ 2047 రోడ్ మ్యాప్‌ను పరిచయం చేయనున్నారు. రాష్ట్ర భవిష్యత్, అభివృద్ధి లక్ష్యాలు, ప్రభుత్వ విధానాలు, పెట్టుబడులకున్న అనుకూలతలను పారిశ్రామికవేత్తల సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించనున్నారు.