Jagtial Travel Bus Fire: జగిత్యాలలో ట్రావెల్ బస్సులో అగ్నిప్రమాదం.. పెను ప్రమాదం తప్పింది
జగిత్యాల నుంచి ముంబై వెళ్తున్న ప్రైవేట్ ఏసీ బస్సు కరెంట్ వైర్లకు తగలడంతో అగ్నిప్రమాదం జరిగింది. 36 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
Jagtial Travel Bus Fire: జగిత్యాలలో ట్రావెల్ బస్సులో అగ్నిప్రమాదం.. పెను ప్రమాదం తప్పింది
Jagtial Travel Bus Fire: జగిత్యాల జిల్లాలో ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సుకు పెనుప్రమాదం తప్పింది. జగిత్యాల నుంచి ప్రయాణికులతో ముంబై వెళ్తున్న బస్సులో అగ్నిప్రమాదం చోటుచెసుకుంది. ప్రమాదవశాత్తు బోరువెల్లి దగ్గర కరెంట్ వైర్లకు తగిలి బస్సులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. బస్సులో దాదాపు 36 మంది ప్రయాణికులు గమ్య స్థలానికి చేరుకోగా వారందరూ సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడ్డారు.
జగిత్యాల పట్టణానికి చెందిన ప్రైవేట్ ట్రావెల్ వీనస్ ఏసి బస్సు, జగిత్యాల నుండి ప్రయాణికులతో తిరిగి ముంబై వెళ్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు బోరువెల్లి వద్ద కరెంటు వైర్లకు తగిలి పూర్తిగా దగ్ధం కావడం జరిగింది, బస్సులో దాదాపు 36 మంది ప్రయాణికులు గమ్య స్థలానికి చేరుకోగా వారందరూ సురక్షితంగా ప్రమాదం నుండి బయటపడ్డారు. ప్రయాణికులకు ఎలాంటి ప్రాణానష్టం జరగకపోవడంతో పెను ప్రమాదం తప్పింది, సంబంధించిన బస్సు పూర్తిగా దగ్ధం కావడం జరిగింది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ...