Telangana: నేడు కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం

* కేంద్ర ప్రభుత్వం రాష్ర్టానికి ఇవ్వాల్సిన నిధుల పైన ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.

Update: 2021-11-16 01:09 GMT

నేడు కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం(ఫోటో- ది హన్స్ ఇండియా)

Telangana: తెలంగాణలో పొలిటికల్ హీట్ రోజు రోజుకు పెరుగుతోంది. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరు రైతులను అయోమయానికి గురి చేస్తున్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ తీరుపై తెలంగాణ ప్రభుత్వం పోరుబాట పట్టింది.

నియోజకవర్గాల వారీగా పెద్ద ఎత్తున ధర్నాలు చేపట్టింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు టీఆర్ఎస్ శాసనసభా పక్షం భేటీ కానున్నది. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరితో పాటు రాష్ర్ట బీజేపీ ప్రచారాన్ని తిప్పికొట్టేలా పార్టీ శ్రేణులకు సీఎం కేసీఆర్ దిశా నిర్దేశం చేయనున్నారు.

దేశమంతా ధాన్యం కొనుగోలు చేసే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేసిన గులాబీ బాస్ ఈనెల 29 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు.

ఈనెల 29న తెలంగాణ దీక్షా దివస్ సందర్భంగా భారీ కార్యక్రమాన్ని తలపెడుతారని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే వరంగల్ బహిరంగ సభ వాయిదా పడిన నేపథ్యంలో ఆ దశగా నిర్ణయం ఉంటుందని భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ర్టానికి ఇవ్వాల్సిన నిధులపైనా కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.

Tags:    

Similar News