Gellu Srinivas: నన్ను గెలిపించుకుని రమ్మని హరీష్ రావుకి అప్పచెప్పారు
Gellu Srinivas: తాను అత్యంత నిరుపేద కుటుంబంలో పుట్టిన వాడినంటున్నారు హుజూరాబాద్ టీఆర్ ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్.
Gellu Srinivas: నన్ను గెలిపించుకుని రమ్మని హరీష్ రావుకి అప్పచెప్పారు
Gellu Srinivas: తాను అత్యంత నిరుపేద కుటుంబంలో పుట్టిన వాడినంటున్నారు హుజూరాబాద్ టీఆర్ ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్. తన గెలుపు బాధ్యతలు కేసీఆర్ హరీష్ రావుకు అప్పగించారన్నారు. ఎన్నో ఉద్యమాలు చేసిన వ్యక్తిగా, టీఆర్ ఎస్ కు ఎన్నోసేవలు అందించిన వ్యక్తిగా మీముందుకొచ్చానంటూ శ్రీనివాస్ అన్నారు. నియోజక వర్గ ప్రజలకు నిత్యం అందుబాటులోనే ఉంటానని తలలోనాలుకలా మసలుకుంటాననీ గెల్లు శ్రీనివాస్ అన్నారు. తనకు ఆస్తిపాస్తులు లేవని, అలాగని పెద్ద కోరికలు కూడా లేవని అన్నారు.
దళిత బంధు ప్రారంభ సమావేశం సందర్భంగా ఈ నెల 16వ తేదీన హుజూరాబాద్‌లో నిర్వహించే బహిరంగ సభలో గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను నియోజకవర్గ ప్రజలకు సీఎం కేసీఆర్ పరిచయం చేయనున్నారు. హుజూరాబాద్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును ప్రకటించిన నేపథ్యంలో ఆయనకు గులాబీ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు.