Minister KTR: మునుగోడును తాను, మంత్రి జగదీష్ రెడ్డి దత్తత తీసుకుంటాం
Minister KTR: మునుగోడు ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే మునుగోడును అన్నిరకాలుగా అభివృద్ది చేస్తాం
Minister KTR: మునుగోడును తాను, మంత్రి జగదీష్ రెడ్డి దత్తత తీసుకుంటాం
Minister KTR: మునుగోడును దత్తత తీసుకుని అన్ని రకాలుగా అభివృద్ది చేసే బాధ్యత తాను, మంత్రి జగదీశ్‌రెడ్డి తీసుకుంటున్నామన్నారు మంత్రి కేటీఆర్. మునుగోడు ఉప ఎన్నికలో భాగంగా పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామనేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం ఈప్రాంతంలోని ఫ్లోరోసిస్ సమస్య పరిష్కారం కోసం మిషన్ భగీరథ పథకం తెస్తే.. బీజేపీ మాత్రం వేలకోట్ల కాంట్రాక్టులిచ్చి ఈప్రాంత ప్రజలను కొనుగోలు చేయాలని చూస్తోందన్నారు. ఇది మునుగోడు ప్రజల ఆత్మగౌరవానికి కాంట్రాక్టర్ దురహంకారానికి జరుగుతున్న పోటీ అని గుర్తు చేశారు మంత్రి కేటీఆర్.