తెలంగాణలో 47 మంది డీఎస్పీల బదిలీ
Telangana: నాలుగేళ్లు ఒకే పార్లమెంట్ పరిధిలో పని చేసిన డీఎస్పీల బదిలీ
తెలంగాణలో 47 మంది డీఎస్పీల బదిలీ
Telangana: పార్లమెంట్ ఎన్నికల వెళ తెలంగాణలో అనూహ్యంగా మార్పులు, చేర్పులు జరుగుతున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పలు శాఖల్లో ప్రభుత్వం బదిలీలను చేపడుతుంది. ఇప్పటికే వివిధ శాఖల్లో పని చేసే అధికారులను బదిలీ చేశారు. తాజాగా తెలంగాణలో 47 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ పోలీసు శాఖ నిర్ణయం తీసుకుంది.
ఎన్నికల నిబంధనల ప్రకారం లోక్ సభ నియోజకవర్గాన్ని యూనిట్ గా పరిగణలోకి తీసుకుని పోలీసు శాఖ బదిలీలను చేపట్టింది. ఒకే పార్లమెంట్ పరిధిలో నాలుగేళ్లు పని చేసిన డీఎస్పీలను పోలీసు శాఖ బదిలీ చేసింది. వీరిలో ఇటీవలే ట్రాన్స్ ఫర్ అయిన అధికారులు కూడా ఉన్నారు. 22 రోజుల్లో అయిదో సారి డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ రవి గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు.