రామంతపూర్‌లో విషాదం: నీటి సంపులో పడి గృహిణి మృతి

హైదరాబాద్‌ రామంతపూర్‌లో విషాదం కేసీఆర్‌నగర్‌లో నీటి సంపులో పడి గృహిణి మృతి

Update: 2025-11-20 10:30 GMT

రామంతపూర్‌లో విషాదం: నీటి సంపులో పడి గృహిణి మృతి

హైదరాబాద్‌ రామంతపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. కేసీఆర్‌నగర్‌లో నీటి సంపులో పడి గృహిణి మృతి చెందిన ఘటన.. స్థానికంగా విషాదాన్ని నింపింది. నల్లా వాల్‌ బంద్‌ చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు భారతి సంపులో పడింది. ఇది గమనించిన స్థానికులు ఆమెను.. సంపులో నుంచి బయటకు తీసి.. హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే.. అప్పటికే భారతి మృతిచెందినట్టు డాక్టర్లు వెల్లడించారు. శ్రీకాకుళంకు చెందిన భారతి కుటుంబం.. 20ఏళ్ల క్రితం బ్రతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వచ్చి రామంతపూర్‌లో నివాసం ఉంటోంది. ఇవాళ ఉదయం ఐదున్నర గంటల సమయంలో నల్లా వాల్‌ బంద్‌ చేసే క్రమంలో నీటి సంపులో పడి భారతి మృత్యువాత పడింది. సమాచారం అందుకున్న పోలీసులు.. మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Tags:    

Similar News