Suryapet: సూర్యాపేట జిల్లాలో టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌ పర్యటన

Suryapet: సింగారం దగ్గర మూసీనదిపై చెక్‌ డ్యాం నిర్మాణ పనుల పరిశీలన * నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేస్తున్నారని ఆరోపణ

Update: 2021-05-23 10:59 GMT

టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమకుమార్ (ఫైల్ ఇమేజ్)

Suryapet: హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో ప్రతి విషయంలో అవినీతి తాండవిస్తోందని ఆరోపించారు టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి. సూర్యాపేట జిల్లా మూసిఒడ్డు సింగారం దగ్గర మూసీనదిపై 7కోట్ల 29 లక్షల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న చెక్‌ డ్యాం పనులను ఆయన పరిశీలించారు. నిబంధనల ప్రకారం 200 మీటర్ల దిగువన కట్టాల్సిన చెక్‌ డ్యాంను డబ్బులు మిగుల్చుకునేందుకు కాంట్రాక్టర్‌, అధికార పార్టీ నేతలు ఎగువ ప్రాంతంలో నిర్మిస్తున్నారని ఆరోపించారు‌. ఈ చెక్‌ డ్యాం నిర్మాణం వల్ల రైతాంగానికి ఎలాంటి ఉపయోగం లేదన్న ఉత్తమ్‌ కాంట్రాక్టర్, టీఆర్‌ఎస్‌ నేతల స్వలాభం కోసమే మూసిఒడ్డు సింగారం దగ్గర చెక్‌ డ్యాం నిర్మాణం జరుగుతోందని వ్యా‌యానించారు.

Tags:    

Similar News