Revanth Reddy: వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
Revanth Reddy: గతంలో సీఎం ఇచ్చిన హామీ ప్రకారం పే స్కేల్ అమలు చేయాలి
Revanth Reddy: వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
Revanth Reddy: సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కేసీఆర్ పాలనలో వీఆర్ఎల బతుకులు అగమ్యగోచరంగా మారాయన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం మూలంగా వీఆర్ఏలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని గుర్తు చేశారు. ఇప్పటికైనా VRAలకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే గతంలో వారికి ఇచ్చిన హమీని సీఎం కేసీఆర్ నిలబెట్టుకోవాలని గుర్తు చేశారు.వీఆర్ఏలు గత 48 రోజలుగా సమ్మె చేస్తున్నారు. ప్రాణాలు కోల్పోతున్నారన్న రేవంత్.. ఇప్పటికైనా అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీ ప్రకారం పే స్కేల్ ఇవ్వాలన్నారు.
ఉన్నత విద్యార్హతలు ఉన్న వారికి పదోన్నతులు కల్పించాలన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీకే దిక్కులేకపోతే రాష్ట్రంలో పాలన ఉన్నట్టా లేనట్టా!? అని ప్రశ్నించారు. ఇప్పటికైనా వీఆర్ఏల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపకుంటే.. వీఆర్ఎల పోరాటానికి కాంగ్రెస్ పార్టీ మద్ధతుగా నిలవడమే కాకుండా వారి తరపున ప్రత్యక్ష కార్యచరణకు సైతం సిద్ధమవుతామన్నారు.