Revanth Reddy: జగన్‌తో కేసీఆర్ కుమ్మక్కయ్యారా..?
* కృష్ణా జలాలపై సమర్ధవంతమైన వాదన వినిపించలేదు * నీటి పంపకాల్లో తెలంగాణకు టీఆర్ఎస్ అన్యాయం చేసింది
రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)
Revanth Reddy: తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీ ముఖ్యమంత్రి జగన్‌తో కుమక్యయ్యారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ చేస్తున్న దగా మరోసారి నిరూపితమయిందని అన్నారు. కృష్ణా జలాలపై సమర్థవంతమైన వాదన విన్పించలేదని రేవంత్ మండిపడ్డారు. నీటి పంపకాల్లో తెలంగాణకు టీఆర్ఎస్ అన్యాయం చేసిందని, తెలంగాణ ప్రజల హక్కులను కేసీఆర్ తాకట్టు పెట్టాడని రేవంత్ రెడ్డి ఆరోపించారు.