Mahesh Kumar Goud: తెలంగాణ కోసం కేసీఆర్‌ చేసిన దీక్ష ఒక నాటకం

Update: 2025-11-28 09:49 GMT

Mahesh Kumar Goud: తెలంగాణ రాష్ట్ర సెంటిమెంట్‌ను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గతంలో వాడుకున్నారని, ఇప్పుడు మళ్లీ 'దీక్షా దివస్' పేరుతో మరోసారి సెంటిమెంట్‌ను రాజేసేందుకు ప్రయత్నిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేసిన దీక్ష కేవలం ఒక నాటకమేనని ఆయన అభివర్ణించారు.

కేసీఆర్ దీక్షపై విమర్శలు:

"కేసీఆర్‌ మూడు రోజులకే దీక్షను ముగించి పలాయనం చిత్తగించారు. దీక్షను మధ్యలోనే విరమించడంతో అప్పట్లో విద్యార్థి సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది."

"తెలంగాణ కేవలం కేసీఆర్‌ వల్ల రాలేదు. కాంగ్రెస్‌ పార్టీ వల్ల రాష్ట్రం సాధ్యమైంది. పొట్టి శ్రీరాములు చేసిన త్యాగపూరిత దీక్షకు, కేసీఆర్‌ దీక్షకు ఏమాత్రం పొంతన లేదు."

తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న పేదలు, విద్యార్థులు, ఎస్సీలు, ఎస్టీలు ఆత్మార్పణం చేసుకున్నారని మహేశ్ కుమార్ గౌడ్ గుర్తుచేశారు. అయితే, వారి త్యాగాల వల్ల వచ్చిన రాష్ట్రాన్ని కేసీఆర్‌ కుటుంబం పదేళ్ల పాటు దోచుకుందని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ చొరవ వల్లే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని ఆయన స్పష్టం చేశారు.

Tags:    

Similar News