ఇవాళ 6వ రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

TS Assembly: రాష్ట్ర విద్యుత్ రంగం, ప్రభుత్వ శ్వేతపత్రంపై లఘు చర్చ

Update: 2023-12-21 03:34 GMT

ఇవాళ 6వ రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

TS Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా కొనసాగుతున్నాయి. ఇవాళ ఆరవ రోజు సమావేశాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర విద్యుత్ రంగం, ప్రభుత్వం రిలీజ్ చేసిన శ్వేతపత్రంపై లఘు చర్చ జరగనుంది. తెలంగాణ విద్యుత్ శాఖలో 85 వేల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయంటూ ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటికే తీవ్ర నష్టాల్లో ఉన్న విద్యుత్ పంపిణీ సంస్థలకు విద్యుత్ బిల్లుల మొండి బకాయిలు వేధిస్తున్నాయని చెప్తోంది. ప్రభుత్వ బకాయిలతోనే ఉత్తర, దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు 50 వేల కోట్లకు పైగా భారీ నష్టాలను మూటగట్టుకున్నాయని రాష్ట్ర ప్రభుత్వానికి విద్యుత్‌శాఖ నివేదికను సమర్పించింది.

అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి 29 వేల 140 కోట్ల రూపాయల విద్యుత్ బిల్లులు బకాయిలు రావాల్సి ఉండగా.. మరో 12 వేల 515 కోట్లు ట్రూఅప్ చార్జీలను సైతం రాష్ట్ర ప్రభుత్వం బకాయిపడినట్లు నివేదికలో తెలిపింది. ఈ రెండింటీని కలిపితే డిస్కంలకు రావాల్సిన మొత్తం బకాయిలు 40 వేల 655 కోట్లకు చేరుకుంటాయని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ బకాయిలను చెల్లిస్తే డిస్కంల నష్టాలు 9 వేల 620 కోట్లకు తగ్గిపోతాయని అంచనా వేస్తోంది. అయితే ట్రూఅప్ ఛార్జీలను వినియోగదారుల నుంచి వసూలు చేసేందుకు విద్యుత్ శాఖ ప్రయత్నించగా.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని తెలిపింది.

Tags:    

Similar News