Telangana CM KCR : ప్రజాప్రతినిధులతో సమావేశం కానున్న సీఎం కేసీఆర్‌

Update: 2020-10-03 06:15 GMT

Telangana CM KCR : తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ ఎన్నికల హడావుడి మొదలయింది. ఓ వైను పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండగా మరో వైను జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రంమలోనే సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే 20 జిల్లాల పరిధిలోని ప్రజాప్రతినిధులతో సమావేశం కానున్నారు. హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాలతో పాటు ఉమ్మడి నల్లగొండ, వరంగల్‌, ఖమ్మం ఎంపీలు, ఎమ్మెల్యేలతో మధ్యాహ్నం ఈ రోజు 12 గంటలకు సీఎం భేటీ జరుగనుంది. ఈ సమావేశంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎన్నికల్లో విజయం సాధించేందుకు గాను పార్టీ కార్యకర్తలను సమాయత్తం చేసేందుకు నాయకులకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు.

ఇక పోతే హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ నియోజకవర్గం నుంచి ఎన్‌.రామచంద్రరావు, అలాగే ఖమ్మం, నల్లగొండ, వరంగల్‌ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వరరెడ్డి ప్రస్తుతం పదవిలో కొనసాగుతున్నారు. అయితే వీరి పదవీకాలం మరికొద్ది రోజుల్లో ముగియనుండటంతో ప్రభుత్వం ఈ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తుంది. ఈ క్రమంలోనే ఈ నెల 1 నుంచి ప్రారంభమైన గ్రాడ్యుయేట్‌ నియోజకవర్గ ఓటర్ల నమోదు ప్రక్రియ నవంబర్‌ 6 వరకు కొనసాగునుంది. అయితే రాష్ట్రంలోని చాలా మంది యువతకు ఎమ్మెల్సీ ఎన్నికల మీద సరైన అవగాహన, చైతన్యం లేక గ్రాడ్యుయేట్లు ఓటరుగా నమోదు చేసుకోవడంలేదు. కానీ ఈ సారి ప్రతిఒక్కరూ ఒక్క గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకునేలా టీఆర్‌ఎస్‌ నాయకులు చొరవ తీసుకుంటున్నారు.

Tags:    

Similar News