ఆదిలాబాద్ జిల్లాలో పెద్దపులి సంచారం.. భయాందోళనలో స్థానికులు
Adilabad: మార్నింగ్ వాక్ కోసం బయటకు రావొద్దంటున్న అధికారులు
ఆదిలాబాద్ జిల్లాలో పెద్దపులి సంచారం.. భయాందోళనలో స్థానికులు
Adilabad: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండు వేర్వేరు చోట్ల పులి సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. అభయారణ్యాన్ని వీడిన పెద్దపులి జనారణ్యంలో సంచరిస్తూ ప్రజలకు దడపుట్టిస్తోంది. గతవారం నుంచి కొమురంభీమ్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న పెద్దపులి... ఇవాళ పట్టణంలో కన్పించడంతో భయానికి గురవుతున్నారు. వినయ్ గార్డెన్ దగ్గర పులి సంచరించడంతో భయపడుతున్నారు. దీంతో ఒక్కసారిగా పులిన చూసిన స్థానికులు పరుగులు పెట్టారు. సమాచారం అందుకున్న అటవీ అధికారులు.. పులిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.