ట్రాఫిక్‌ పోలీసుల ఓవరాక్షన్‌.. కారును ఆపిన పోలీసులు.. ఆస్పత్రికి వెళ్లడం ఆలస్యం కావడంతో చిన్నారి మృతి..

Traffic Police: యాదాద్రి జిల్లా వంగపల్లిలో ట్రాఫిక్‌ పోలీసుల ఓవరాక్షన్‌కు ఓ చిన్నారి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Update: 2022-06-01 06:36 GMT

ట్రాఫిక్‌ పోలీసుల ఓవరాక్షన్‌.. కారును ఆపిన పోలీసులు.. ఆస్పత్రికి వెళ్లడం ఆలస్యం కావడంతో చిన్నారి మృతి..

Traffic Police: యాదాద్రి జిల్లా వంగపల్లిలో ట్రాఫిక్‌ పోలీసుల ఓవరాక్షన్‌కు ఓ చిన్నారి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ్తున్న కారును ఆపిన పోలీసులు వాహనంపై ఉన్న రూ. వెయ్యి చలానా చెల్లించాలని డిమాండ్‌ చేశారు. బాబును ఆసుపత్రికి తీసుకెళ్తున్నామని వేడుకున్నా కనికరించకుండా అరగంటపాటు వాహనాన్ని పోలీసులు కదలనివ్వలేదు. దీంతో మూడు నెలల చిన్నారి పరిస్థితి విషమించినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆసుపత్రికి చేరడానికి ఆలస్యం కావడంతో మూడు నెలల బాబు మృతి చెందినట్లు తల్లిదండ్రులు గుండె చెరువయ్యేలా రోధిస్తున్నారు.

జనగామకు చెందిన దంపతులకు మూడు నెలల కిందటే కుమారుడు జన్మించాడు. బాబు అనారోగ్యంగా ఉండటంతో అద్దె కారులో హైదరాబాద్‌కు తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. వంగపల్లి వద్ద కారును ఆపిన ట్రాఫిక్ పోలీసులు వాహనంపై వెయ్యి రూపాయల చలానా ఉందని చెల్లించాలని డిమాండ్ చేశారు. పోలీసులు వాహనాన్ని అరగంట ఆపడంతో బాబు మృతి చెందినట్లు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వంగపల్లిలో వాహనాన్ని ఆపిన ఘటనపై ట్రాఫిక్ పోలీసులు భిన్న వాదన వినిపిస్తున్నారు. కారులోని వ్యక్తులు సీటుబెల్టు ధరించకపోవడాన్ని గమనించి వాహనాన్ని ఆపామని పోలీసులు తెలిపారు. బాబుకు సీరియస్‌గా ఉన్న విషయాన్ని ఎవరూ చెప్పలేదని పోలీసులు అంటున్నారు. 

Full View


Tags:    

Similar News