ప్రీతి ఘటన మరవకముందే.. వరంగల్‌లో ర్యాగింగ్‌కు మరో విద్యార్ధిని బలి

* సీనియర్ విద్యార్థులు వేధించడంతో రక్షిత మనస్తాపం

Update: 2023-02-27 07:12 GMT

ప్రీతి ఘటన మరవకముందే.. వరంగల్‌లో ర్యాగింగ్‌కు మరో విద్యార్ధిని బలి

RakshithaSuicide: వరంగల్ జిల్లాలో మరో విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. నర్సంపేటలో ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ చదువుతున్న రక్షిత అనే విద్యార్థిని ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. సీనియర్ విద్యార్థులు వేధించడంతో రక్షిత మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులనుంచి కళాశాలకు రక్షిత రావడంలేదని కళాశాల యాజమాన్యం చెబుతోంది. పరీక్షల్లో తప్పడంతోపాటు, అటెండెన్స్ సరిగా లేకపోవడంతో డీటెయిన్ అయిందని కళాశాల యజమాన్యం పేర్కొంది.

Tags:    

Similar News