Mahabubabad: మహబూబాబాద్‌లో దొంగల బీభత్సం
Mahabubabad: యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో చోరీకి విఫలయత్నం
representational Image
Mahabubabad: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో దొంగలు బీభత్సం సృష్టించారు. యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో చోరీకి విఫలయత్నం చేశారు. అర్ధరాత్రి ఏటీఎం సెంటర్‌లో గుర్తుతెలియని దుండగులు పెట్రోల్ పోసి నిప్పటించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అయితే మొదట షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించినట్లు పోలీసులు భావించారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా చోరీ యత్నం అని పోలీసులు నిర్ధారించారు. మరోవైపు ఈ ఘటనలో భారీగా నష్టం జరిగినట్లు తెలుస్తోంది.