రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని ఏటీంఎంలలో వరుస చోరీలు

* ఏటీఎంలను ధ్వంసం చేసి, చోరీకి పాల్పడుతున్న అంతర్జాతీయ దొంగల ముఠా * నిర్మానుష్య ప్రాంతాల్లో దారి దోపీడికి పాల్పడుతున్న దొంగలు * నిందితులను పట్టుకొని డబ్బులను రికవరీ చేసిన రాచకొండ పోలీసులు * ఏటీఎంలల్లో అలారం ఏర్పాటు చేసుకోవాలని బ్యాంకు అధికారులకు సీపీ సూచన

Update: 2020-12-24 10:57 GMT

ఏటీఎంలను ధ్వంసం చేసి, చోరీలకు పాల్పడుతున్న అంతర్జాతీయ ముఠాలపై ఉక్కుపాదం మోపామని హైదరాబాద్‌ రాచకొండ సీపీ మహేష్ భగవత్‌ తెలిపారు.

రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని శివారు ప్రాంతాల ఎటీఎంలు వరుసగా చోరీకి గురయ్యాయి. అలాగే నిర్మానుష్యం ప్రాంతాల్లో వాహనదారులను బెదిరించి, చోరీకి పాల్పడుతున్నారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు కొందరు నిందితులను పట్టుకొని డబ్బులు, అభరణాలను రికవరీ చేశారు. ఎటీఎంలలో అలారం ఏర్పాటు చేసుకోవాలని బ్యాంకు అధికారులకు సూచిస్తున్న రాచకొండ సీపీ మహేష్ భగవత్‌తో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్.

Tags:    

Similar News