సీఏఏ మాకోద్దంటున్న కేసీఆర్

సీఏఏని వ్యతిరేకిస్తూ తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది. సీఏఏపై కేంద్రం పున సమీక్ష జరుపాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు

Update: 2020-03-16 15:30 GMT

సీఏఏని వ్యతిరేకిస్తూ తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది. సీఏఏపై కేంద్రం పున సమీక్ష జరుపాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు. కేంద్రం ప్రవేశపెట్టిన సీఏఏ చట్టంపై దేశ వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఏడు రాష్ట్రాలు సీఏఏకు వ్యతికంగా తీర్మానం చేశాయి. ఆ జాబితాలో తెలంగాణ రాష్ట్రం కూడా చేరింది.

సీఏఏను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న గులాబీ పార్టీ మరింత పట్టు బిగించింది. సీసీఏను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసింది. సీఏఏపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోందన్నారు సీఎం కేసీఆర్. సీఏఏపై కేంద్రం పున: సమీక్షించాలని కోరారు. సీఏఏపై తీర్మానంతో పాటు జీవోను విడుదల చేయాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కోరారు. మన తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని ఎన్.ఆర్.సిని తొలగించాలన్నారు.

సీఏఏ వల్ల ఎవరికైనా అన్యాయం జరుగుతుందని నిరూపిస్తే.. రాజీనామా చేసి, తెలంగాణ నుంచి వెళ్లిపోతానని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రకటించారు. సీఏఏను వ్యతిరేస్తూ చేసిన తీర్మానానికి టీఆర్ఎస్, కాంగ్రెస్‌, ఎంఐఎంలు మద్దతు తెలపగా.. బీజేపీ వ్యతిరేకించింది. మొత్తానికి సీఏఏని వ్యతిరేకిస్తూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఆమోదించింది.  

Tags:    

Similar News