WINGS INDIA: రెండోరోజు వింగ్స్‌ ఇండియా 2024 విమానాల ప్రదర్శన

WINGS INDIA: రేపు, ఎల్లుండి సాధారణ సందర్శకులకు అనుమతి

Update: 2024-01-19 04:33 GMT

WINGS INDIA: రెండోరోజు వింగ్స్‌ ఇండియా 2024 విమానాల ప్రదర్శన

WINGS INDIA: అంతర్జాతీయ విమానాల ప్రదర్శనకు భాగ్యనగరం మరోసారి వేదిక అయ్యింది. బేగంపేట్ విమానాశ్రయంలో నాలుగు రోజుల పాటు వింగ్స్ ఇండియా 2024 పేరుతో భారీ ప్రదర్శన నిర్వహిస్తున్నారు. కేంద్ర పౌర విమానయానశాఖ సహకారంతో ఫిక్కీ ఆధ్వర్యంలో వింగ్స్ ఇండియా ప్రదర్శన చేపడుతున్నారు.

విమాన రంగానికి మరింత ఊతమిచ్చేల నిర్వహిస్తున్న వింగ్స్ ఇండియా 2024 ప్రదర్శనకు హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం ముస్తాబయ్యింది. ఈ నెల 21 వరకు వింగ్స్ ఇండియా కార్యక్రమం నిర్వహిస్తారు. 4 రోజుల పాటు నిర్వహించే ఈ ప్రదర్శనలో దేశ విదేశాలకు చెందిన అధునాతన విమానాలు చూపురులను కనువిందు చేస్తున్నాయి. విమానయానానికి ప్రజలను మరింత చేరువ చేయడంతో పాటు ఈ రంగానికి ఉన్న అవకాశాలను వ్యాపారవేత్తలకు, అంకుర పరిశ్రమలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో వింగ్స్ ఇండియా ప్రదర్శన నిర్వహిస్తున్నారు.

వింగ్స్ ఇండియా 2024 ఈవెంట్ హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో ఇవ్వల ప్రదర్శన ప్రారంభం అయ్యింది. మంత్రిత్వ శాఖ మరియు ఫిక్కీ సహకారంతో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,ఇతర ఏవియేషన్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

వ్యాపారవేత్తలు, పరిశ్రమలు, విమాన ఆపరేటర్లు, తయారీదారులు, సాంకేతిక పరిజ్ఞానం అందించే సాఫ్ట్‌వేర్‌ సంస్థలను ఒకచోట చేర్చడానికి వింగ్స్ ఇండియా 2024 ప్రదర్శన ఎంతో దోహదపడుతోంది. ఈసారి జరిగే ప్రదర్శనలో 106 దేశాల నుంచి 1500 మంది ప్రతినిధులు హాజరవుతారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. అంతే కాకుండా 5వేల మంది వైమానిక రంగానికి చెందిన వ్యాపారవేత్తలు హాజరవుతు పలు ఒప్పందాలు చేసుకుంటున్నారు.

బేగంపేట కేంద్రంగా జరుగుతున్న వింగ్స్ ఇండియా 2024 షోకు రోజుకు 25 విమానాలు పైగా ప్రదర్శనకు వస్తున్నాయి. లక్ష మంది ఈ ప్రదర్శనను తిలకించే అవకాశం ఉంది. ప్రపంచంలోనే అతిపెద్దదైన బోయింగ్ 777-X విమానం బేగంపేట ఎయిర్‌పోర్టుకు ఇప్పటికే చేరుకుంది. ప్రపంచంలో ఎక్కడికైనా 2గంటల్లోనే బోయింగ్ 777-X విమానంలో ప్రయాణం చేయొచ్చు. దేశంలో తొలిసారిగా హైదరాబాద్ లోనే బోయింగ్ 777 ఎక్స్ ప్రదర్శించనున్నారు. ఇంకా ఈ విమానం లంచ్ చెయ్యలేదు.. టెస్టింగ్ నడుస్తుంది. ప్రయాణికులు ప్రయనించేందుకు 2,3 సంవత్సరాలు పట్టె అవకాశం ఉంది.

బేగంపేట వైపు వెళ్లే ప్రాంతాల్లో ఇప్పటికే ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు వాహనాలను మల్లిస్తున్నారు. 20,21 తేదీల్లో సాధారణ ప్రజలను అనుమతించనున్నారు. ఆన్ లైన్ ద్వారా బుక్ చేసుకొని సందర్శకులు వీక్షించవచ్చని నిర్వాహకులు తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద విమానమైన బోయింగ్‌తో పాటు పలు రకాల విమానాలను ఈ షోలో ప్రదర్శిస్తున్నారు.

Tags:    

Similar News