Weather Update: 4 రోజుల పాటు రాష్ట్రంలో వానలే వానలు.. అప్రమత్తంగా ఉండాలన్న ఐఎండీ..!!
Weather Update: 4 రోజుల పాటు రాష్ట్రంలో వానలే వానలు.. అప్రమత్తంగా ఉండాలన్న ఐఎండీ..!!
Weather Update: తెలంగాణలో వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయి.రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రానున్న ఐదు రోజులు వర్షాలు, ఈదురుగాలులురాష్ట్రంలోని పలు జిల్లాల్లో ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. ఇవాళ్టి నుంచి గురువారం వరకు పలు జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ సూచనలు జారీ చేశారు.
ఈఏడాది వర్షాకాలం ప్రారంభానికి ముందే తెలంగాణలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. అందుకే ముందుగానే కొన్ని ప్రాంతాల్లో వర్షాలు ప్రారంభం అయ్యాయి. అయితే ప్రస్తుతం ఈశాన్య దిశగా పటమరలుతున్న రుతుపవనాలు తెలంగాణపై ప్రభావాన్ని తగ్గించాయి. దీంతో గత రెండు రోజులుగా వర్షాలు తగ్గాయి. మరోవైపు రోహిణీ కార్తె కారణంగా ఎండలు తీవ్రంగా ఉన్నాయి. రానున్న ఐదు రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉంది. జూన్ 2వ తేదీన కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
జూన్ 3, 4వ తేదీల్లో తెలంగాణలో అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ సమయంలో కూడా గంటకు 30 నుంచి 40కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. జూన్ 6న కరీంనగర్, పెద్దపల్లి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, జోగులాంబ గద్వాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు తెలిపారు. ఒకవైపు వర్షాలు కురుస్తున్నా..మరోవైపు ఎండలతీవ్రత కూడా తగ్గలేదు. నేడు కూడా పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని అధికారులు తెలిపారు.