TS High Court: కార్పొరేషన్ల ఛైర్మన్ల అవిశ్వాసంపై హైకోర్టు ఆగ్రహం

TS High Court: తదుపరి విచారణలోగా కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్ట్ ఆదేశం

Update: 2024-01-24 04:23 GMT

TS High Court: కార్పొరేషన్ల ఛైర్మన్ల అవిశ్వాసంపై హైకోర్టు ఆగ్రహం

TS High Court: రాష్ట్రంలోని వివిధ మున్సిపాలిటీల్లో చైర్మన్ల అవిశ్వాసంపై వాదనలేంటో చెప్పాలని ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, కమిషనర్‌తో పాటు సంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి భువనగిరి, జనగాం జిల్లాల కలెక్టర్లకు నోటీసులు జారీ చేసింది. తదు పరి విచారణలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అవిశ్వాసాలకు సంబంధించి ఇచ్చిన నోటీసు లను సవాల్ చేస్తూ పలు మున్సిపాలిటీలకు చెందిన చైర్మన్లు, వైస్ చైర్మన్లు హైకోర్టులో రిట్ పిటిషన్లు దాఖలు చేశారు.

అవిశ్వాస ప్రక్రియను నిలుపుదల చేయాలని కోరారు. వీటిపై విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి.. పిటిషన్లను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాల్ చేస్తూ సదాశివపేట మున్సిపల్ చైర్పర్సన్ జయమ్మ, జోగిపేట్ చైర్పర్సన్ మల్లయ్య, జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కావ్య, ఆలేర్ మున్సిపాలిటీ చైర్పర్సన్ శంకరయ్య రిట్ అప్పీల్లు దాఖలు చేశారు. ఈ పిటిష న్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్ కుమార్ జూకంటి ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది.

తెలంగాణ మున్సిపాలిటీ చట్టం - 2019 సెక్షన్ - 37 ప్రకారం పిటిషనర్లపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం లేదన్నారు. అవిశ్వాస నోటీసులను నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను 29కి వాయిదా వేసింది.

Tags:    

Similar News