రెవెన్యూశాఖలో VRO, VRA వ్యవస్థను రద్దు చేసిన ప్రభుత్వం

Telangana: ఏ శాఖలో విలీనం చేస్తారో క్లారిటీ ఇవ్వని అధికారులు

Update: 2022-08-01 06:17 GMT

రెవెన్యూశాఖలో VRO, VRA వ్యవస్థను రద్దు చేసిన ప్రభుత్వం

Telangana: తెలంగాణ రెవెన్యూ శాఖలో దాదాపు 20 వేలకు పైగా ఉద్యోగుల గందరగోళం నెలకొంది. VRO, VRAలకు ఇచ్చిన హామీలు సంవత్సరాలు గడుస్తున్న ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క హామిని కూడా నెరవేర్చలేదు. రెవెన్యూ శాఖలో VROల అవినీతితో ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చిందని సీఎం కేసీఆర్ VRO వ్యవస్థను రద్దు చేసారు. 2020 సెప్టెంబర్ 8 వతేదీన VROవ్యవస్థను ప్రభుత్వం రద్దు చేసింది. రద్దు చేసి దాదాపు రెండు సంవత్సరాలు కావస్తోంది. ఇప్పటి వరకు వారిని ఏ శాఖలో విలీనం చేస్తారో ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు. అసలు VRO, VRAలను ఏ శాఖలో విలీనం చేస్తారు..? VRAలకు పే స్కేల్, కారుణ్య నియామకాల హామీలను ఇప్పటి వరకు ఎందుకు అమలు చేయలేదని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూశాఖలో పనిచేస్తున్న దాదాపు 5వేల 485 మంది వీఆర్వోలను 2020 సెప్టెంబర్ 8న ప్రభుత్వం ఆ డిపార్ట్‌మెంట్​నుంచి తప్పించింది. VRO పదవిని రద్దు చేసి దాదాపు రెండు సంవత్సరాలు కావోస్తుంది. కానీ ఇప్పటి వరకు వారికి ఏ ప్రభుత్వ శాఖల్లో సర్దుబాటు చేయలేదు. ప్రతిరోజూ ఉదయం తహసీల్దార్​ఆఫీసులకు వెళ్లడం..వాళ్లు ఏ డ్యూటీ వేస్తే ఆ డ్యూటీకి పోవడమే వీళ్ల డ్యూటీగా మారింది. ప్రాపర్టీ సర్వే, కస్టమ్​మిల్లింగ్​పర్యవేక్షణతో పాటు కల్యాణలక్ష్మి అప్లికేషన్లు, క్యాస్ట్​, ఇన్‌కమ్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఇలా అన్ని పనులూ చేయాల్సి వస్తోందనటున్నారు.

మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో రెండు వేల మందిని వార్డు ఆఫీసర్లుగా నియమించాలనే ప్రపోజల్స్​వచ్చాయి. సుమారు 18 డిపార్ట్‌మెంట్ల నుంచి జూనియర్​అసిస్టెంట్​క్యాడర్ పోస్టుల వివరాలను కూడా తీసుకున్న ఉన్నతాధికారులు ఇప్పటివరకు VROలను ఎక్కడ సర్దుబాటు చేయలేదు. ఆఫీసర్లు మాత్రం అగ్రికల్చర్​, ఇరిగేషన్​, పంచాయతీరాజ్​, మున్సిపాలిటీలలోనే అడ్జస్ట్ చేస్తామని, పేరు మార్చి రెవెన్యూలోనే కొనసాగిస్తామని వీఆర్వోలకు చెబుతున్నారు. కానీ ఉన్నతాధికారుల నుంచి ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న VRAలకు పే స్కేల్, వారసులకు ఉద్యోగాలు ఇస్తానని సీఎం కేసిఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేదు. రాష్ట్రంలో దాదాపుగా19వేల మంది VRAలు ఉన్నారు. అసెంబ్లీలో సీఎం కేసిఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని VRO, VRAలు డిమాండ్ చేస్తున్నారు.


Tags:    

Similar News