గులాబీ నేతల్లో వెంటాడుతున్న దర్యాప్తు సంస్థల భయం

TRS: పదే పదే కేంద్రానికి టీఆర్ఎస్ నేతల సవాళ్లు

Update: 2022-04-12 13:00 GMT

గులాబీ నేతల్లో వెంటాడుతున్న దర్యాప్తు సంస్థల భయం

TRS: గులాబీ నేతల్లో దర్యాప్తు సంస్థల భయం స్పష్టంగా కన్పిస్తోంది. ఇటీవల ఏ ఇద్దరు టీఆర్ఎస్ నేతలు కలిసినా ఐటీ, ఈడీ, సీబీఐ దాడుల గురించిన మాట్లాడుకుంటున్నారు. దాడులు చేయండంటూ గులాబీ బాస్ కేసీఆర్ నోట ఢిల్లీ వేదికగా సవాల్ రావడంతో ఇక ఢిల్లీ పెద్దలు ఊరుకుంటారా అని నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. వడ్ల పోరులో బీజేపీ పెద్దలపై కేసీఆర్ దూకుడు పెంచారు. దమ్ముంటే అరెస్టు చేయండని సవాల్ విసిరారు. అదే సమయంలో మోడీ ఈడీని నమ్ముకుంటే కేసీఆర్ తెలంగాణవాదాన్ని నమ్ముకున్నాడని గులాబీ నేతలు క్లారిటీ ఇస్తున్నారు.

తాజాగా టీఆర్ఎస్ ముఖ్య నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి నోట ఐటీ దాడుల మాట రావడంతో తెర వెనుక ఏదో జరుగుతుందన్న చర్చ పార్టీలో మొదలయ్యింది. ఇటీవల సందర్భం వచ్చిన ప్రతి సారీ కేసీఆర్ ఐటీ, ఈడీ దాడుల గూరించే మాట్లాడుతుండటంతో నేతల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయ్. ఇప్పటికే కేసీఆర్ సన్నిహితులని కేంద్రం టార్గెట్ చేసిందన్న వర్షన్ ఉంది. కొన్ని సంస్థలపై దాడులు వ్యవహారం బయటకు పొక్కలేదని కారు పార్టీ నేతల ఆర్థిక మూలాలు దెబ్బతీయాలని చూస్తున్నారన్న అభిప్రాయం టీఆర్ఎస్ నేతల్లో విన్పిస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి యాకస్వామి అందిస్తారు.

Tags:    

Similar News