కుమార్తె ప్రేమకు అడ్డు చెప్పాడని..తండ్రి దారుణ హత్య

దారుణం జరిగింది. కుమార్తె ప్రేమకు అడ్డు చెప్పాడని తండ్రిపై కుటుంబ సభ్యులంతా దాడి హతమార్చిన ఘటన తీవ్ర కలకలం రేపింది.

Update: 2025-06-19 02:57 GMT

కుమార్తె ప్రేమకు అడ్డు చెప్పాడని..తండ్రి దారుణ హత్య

దారుణం జరిగింది. కుమార్తె ప్రేమకు అడ్డు చెప్పాడని తండ్రిపై కుటుంబ సభ్యులంతా దాడి హతమార్చిన ఘటన తీవ్ర కలకలం రేపింది. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం డీఎస్ఆర్ జెండాల్ తండాల్ మంగళవారం ఈదారుణ ఘటన జరిగింది. మరిపెడ సీఐ రాజ్ కుమార్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం..ధారావత్ కిషన్ కు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇటీవల చిన్న కుమార్తె పల్లవి అదే తండాకు చెందిన భూక్య సురేశ్ తో ఫోనులో మాట్లాడుతుండటంతో కుమార్తెను కిషన్ మందలించాడు. తన ప్రేమను తండ్రి అంగీకరించడంలేదని పల్లవి తీవ్ర ఆగ్రహానికి లోనైంది. ఆయన భార్య కావ్య, ఇద్దరు కుమార్తెలు, పల్లవి ప్రియుడుసురేశ్ మరో ఇద్దరు యువకులు కలిసి కిషన్ పై దాడికి దిగారు. తీవ్రగాయాలతో అపస్మారక స్థితిలోకి చేరుకున్న కిషన్ ను తల్లి సాంకి మహబూబాబాద్ ఆసుపత్రికి తరలించింది. అక్కడి నుంచి ఖమ్మంకు తరలిస్తుండగా ఆయన మరణించాడు. సాంకి ఫిర్యాదు మేరకు భార్య కావ్య, కుమార్తెలు రమ్య, పల్లవి, సురేశ్, చందు, దేవేందర్ లపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

Tags:    

Similar News