భారీ వర్షానికి కొట్టుకుపోయిన తాత్కాలిక బ్రిడ్జి

Update: 2019-10-29 09:43 GMT

నిజామాబాద్ జిల్లా బిచ్కుంద మండలంలో కురిసిన భారీ వర్షాలకు పెద్ద ద్యావాడ వాగు పొంగిపొర్లింది. వాగు ప్రవాహంతో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వంతెన తెగిపోయింది. నెల రోజుల క్రితం వరదలకు వంతెన తెగి రాకపోకలు నిలిచిపోగా రెండుసార్లు మరమ్మతు చేశారు. వారం రోజుల పాటు రాకపోకలు సాగాయి.

గత రాత్రి కురిసిన వర్షంతో వంతెన మూడోసారి కొట్టుకుపోయింది. దీంతో బాన్సువాడ-బిచ్కుంద మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఈ వంతెన నుండి మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు మార్గం ఉండటంతో ఆ రాష్ట్రాలకు రవాణాకు అంతరాయం ఏర్పడింది. అధికారులు వంతెన పనులు త్వరంగా పూర్తి చేయించకపోవడంపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Tags:    

Similar News