పరాయి రాష్ట్రంలో తెలుగు విద్యార్ధుల పాట్లు...

దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నిర్వహిస్తున్న నేపథ్యంలో రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడ పూర్తిగా స్థంబించిపోయింది.

Update: 2020-04-25 13:28 GMT

దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నిర్వహిస్తున్న నేపథ్యంలో రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడ పూర్తిగా స్థంబించిపోయింది.దీంతో ఎంతో మంది తెలుగు రాష్ట్రాల విద్యార్ధులు తమ సొంత గ్రామాలకు చేరుకోక, ఇతర రాష్ట్రాలలో ఉండలేక ఇబ్బందులు పడుతున్నారు. మరికొంత మంది విద్యార్థులు తినడానికి తిండి కూడా లేకుండా ఆకలికి అలమటించిపోతున్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, మంత్రులకు తమను తమ రాష్ట్రాలకు తీసుకురావడానికి చర్యలు తీసుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే రాజస్థాన్‌లో కొంత మంది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టాల విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. సుమారు 200 మంది విద్యార్థులు లాక్‌డౌన్‌ కారణంగా అక్కడే చిక్కుకుపోయారు. వారందరూ నీట్‌, ఐఐటీ కోచింగ్‌కు వెళ్లి వివిధ వసతి గృహాల్లో ఉంటున్నవారే. రాజస్థాన్‌లో కరోనా కేసులతో తీవ్రంగా పెరుగుతుండడంతో వారు ఉంటున్న వసతి గృహాలను నిర్వహకులు మూసివేయడంతో విద్యార్ధులు దిక్కుతోచని పరిస్థితుల్లో కాలం వెల్లదీస్తున్నారు.

లాక్ డౌన్ కారణంగా ఇటు రాలేక అక్కడ ఉండలేక తినడానికి తిండి దొరకక వారు బిస్కెట్లు తిని బతుకుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రాష్ట్రాల విద్యార్థులను ప్రభుత్వం చొరవ తీసుకుని తీసుకెళ్లారని వారు తెలుపుతున్నారు. ఎలాగయినా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చొరవ తీసుకుని తమను తమ రాష్ట్రాలకు తరలించాలని సీఎంలు కేసీఆర్‌, జగన్‌లకు విజ్ఞప్తి చేశారు. తాము పడుతున్న కష్టాలను, బాధలను ఓ వీడియోను తీసి సీఎంలకు పంపించారు. దీనిపై స్పందించిన సీఎం కేసీఆర్‌ వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Tags:    

Similar News