రాష్ట్ర ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం.. అడ్మిషన్లు లేని కళాశాలలు రద్దు...

Telangana: డిగ్రీలో ఏకోర్సు చేసినా... పీజీలో ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్ పూర్తిచేసే అవకాశం

Update: 2022-05-17 04:15 GMT

రాష్ట్ర ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం.. అడ్మిషన్లు లేని కళాశాలలు రద్దు...

Telangana: తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం తీసుకుంది. అడ్మిషన్లు జరగని కాలేజీలను, కాలేజీల్లో కోర్సుల్ని రద్దు చేయాలని సంచలన నిర్ణయం తసుకున్నారు. యూనివర్శిటీల వైస్‌ఛాన్సలర్ల సమావేశంలో విద్యా విధానాల్లో తలపెట్టనున్న సంస్కరణలపై కీలక నిర్ణయం తీసుకున్నామని ఈ విద్యాసంవత్సరం నుంచే అమలు చేయనున్నట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి తెలిపారు.

విద్యా విధానాల్లో సంస్కరణలతో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకోబోతున్నాయని ఉస్మానియా యూనివర్శిటీ వైస్‌ఛాన్సలర్ ప్రొఫెసర్ రవీందర్ తెలిపారు. విద్యార్థుల ఆసక్తిని బట్టి పోస్టు గ్రాడ్యుయేషన్ ‌లో ఇష్టమొచ్చిన సబ్జెక్టును ఎంపిక చేసుకునేందుకు వెసులుబాటు కల్పించామన్నారు. డిగ్రీలో ఏ కోర్సుచేసినా సరే పీజీలోనూ అభ్యర్థి ఆసక్తికి అనుగుణమైన సబ్జెక్టును ఎంపిక చేసుకోవచ్చని తెలిపారు.

గుణాత్మక మార్పులతో తెలంగాణలో విద్యావిధానం అమలు చేబోతున్నామని కాకతీయ యూనివర్శిటీ వైస్‌ఛాన్సలర్ ప్రొఫెసర్ తాటికొండ రమేష్ తెలిపారు. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలోపెట్టుకుని అడ్మిషన్లు లేని కళాశాలల్లో కొత్త కోర్సులను ప్రవేశపెట్టడంతోపాటు, సబ్జెక్టుల్లో అవసరమైన మార్పులు చేయబోతున్నామని చెప్పారు.

Tags:    

Similar News