న్యూజెర్సీతో తెలంగాణ ఒప్పందం

Update: 2019-09-18 10:06 GMT

అమెరికాలోని న్యూజెర్సీ రాష్ర్టంతో తెలంగాణ రాష్ర్టం సిస్టర్ స్టేట్ పార్టనర్ షిప్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది. హైదరాబాద్ లో జరిగిన సమావేశంలో న్యూజెర్సీ గవర్నర్ ఫిలిప్ మర్ఫీ నేతృత్వంలో తెలంగాణలో పర్యటిస్తున్న బృందం, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. విద్య, వ్యాపార వాణిజ్య అవకాశాల్లో పరస్పర సహాకరం ఏర్పడిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ ఒప్పందంపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కే.జోషీ, న్యూ జెర్సీ గవర్నర్ సంతకాలు చేశారు. ఐటి, ఫార్మ, లైప్ సైన్సెస్, బయోటెక్, ఫిన్ టెక్, డాటా సెంటర్స్, క్లీన్ ఎనర్జీ, ఉన్నత విద్య, టూరిజం వంటి రంగాల్లో తెలంగాణకు మేలు కలుగుతుందన్నారు కేటీఆర్. 

Tags:    

Similar News