Rythu Bharosa: తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. వారందరికీ త్వరలోనే రైతు భరోసా..!

Rythu Bharosa: తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. వారందరికీ త్వరలోనే రైతు భరోసా..!!
Rythu Bharosa: రైతు భరోసా రాని వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. త్వరలోనే వారి ఖాతాల్లో డబ్బు జమ అవుతుందని తెలిపింది. అయితే కొంతమంది రైతులకు రైతు భరోసా స్కీమ్ డబ్బులు రాకపోవడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి అనర్హులైన రైతులకు డబ్బు జమ కాలేదు. రెండోది నాలుగు ఎకరాలకు మించి పొలం ఉన్న రైతులకు కూడా డబ్బు జమ కాలేదు. ఇప్పుడు ప్రభుత్వం ఆ ప్రక్రియను మొదలుపెట్టింది. స్వయంగా రైతుల అకౌంట్లో డబ్బు జమ చేసేందుకు సిద్ధం అయ్యింది. అందువల్ల ఇంకా డబ్బు రాని అనర్హులైన రైతులు ఇప్పుడు అలర్ట్ గా ఉండవచ్చు. ఆ డబ్బు వచ్చేందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
తెలంగాణలో గత బీఆర్ఎస్ సర్కార్ రైతు బంధు స్కీమును బాగా అమలు చేసింది. అర్హులైన రైతులకు ఎకరానికి రూ. 10వేల చొప్పున అందించింది. వందల ఎకరాలు ఉన్నవార కూడా అర్హులుగా చెప్పుకుంటూ..ఈ స్కీమ్ ద్వారా లబ్ది పొందారు. దీంతో ప్రభుత్వం ఖజానాకు చాలా నష్టం జరిగింది. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు బంధు కింద ఒక విడత డబ్బు ఇచ్చి ఆ తర్వాత ఈ స్కీమును రద్దు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు బంధు స్థానంలో రైతు భరోసా స్కీమును ఈ ఏడాది జనవరి 26న ప్రారంభించారు. కానీ లబ్దిదారులందరి అకౌంట్లలో ఒకేసాని డబ్బు జమ చేయలేదు. ముందుగా ఒక ఎకరం ఉన్న రైతులకు డబ్బు ఇచ్చారు. తర్వాత 2 ఎకరాలు, 3ఎకరాలు, 4 ఎకరాలు ఉన్నవారికి ఇచ్చారు. ఆ తర్వాత 4 ఎకరాల కంటే ఎక్కువ పొలం ఉన్నవారికి డబ్బు జమ చేయలేదు. దీంతో ఆ రైతులంతా తమకు ఎప్పుడు ఇస్తారని ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు వారికి శుభవార్త వినిపించింది ప్రభుత్వం.
ఈ స్కీమ్ కింద ఎకరానికి రూ. 15,000 చొప్పున ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. 12వేల చొప్పున మాత్రమే అందిస్తోంది. ఆ డబ్బును 2 విడతలుగా ఇస్తోంది. అయితే ఇప్పటికే నాలుగు ఎకరాలు దాటి పొలం ఉన్నవారికి ఇవ్వకపోవడంతో ఆ డబ్బు రాదని వారు డిసైడ్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమను మోసం చేసిందని అనుకున్నారు. అయితే ప్రభుత్వం ఇప్పుడు డబ్బు ఇచ్చేందుకు ఫైళ్లను ముందుకు కదిపింది.
తాజా అంచనాల ప్రకారం త్వరలోనే 4 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు పొలం ఉన్న రైతులకు రైతు భరోసా ఇస్తారని తెలిసింది. అందువల్ల ఆ రైతులు ..ఆ డబ్బుకి సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులను కలిసి అప్ డేట్స్ తెలుసుకుంటూ ఉండాలి. ఈ నెలాఖరు లోపు డబ్బు అకౌంట్లో జమ కాకపోతే బ్యాంకుకు వెళ్లి వివరాలను కోరవచ్చు. అప్పటికీ డబ్బు రాకపోతే జిల్లా కలెక్టర్ ను కలిసి సమస్యను చెప్పుకోవచ్చు. తద్వారా కలెక్టర్ ఆ డబ్బు వచ్చేలా కింది అధికారులతో పని చేయిస్తారు.