Telangana Rising Global Summit Day 2: రెండో రోజు తెలంగాణ రైజింగ్-2025 సమ్మిట్

Telangana Rising Global Summit Day 2: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ రెండో రోజు కొనసాగనుంది. తొలిరోజు సమ్మిట్ లో తెలంగాణ ప్రభుత్వం పలు సంస్థలతో కీలక ఒప్పందాలు చేసుకుంది.

Update: 2025-12-09 06:04 GMT

Telangana Rising Global Summit Day 2: రెండో రోజు తెలంగాణ రైజింగ్-2025 సమ్మిట్

Telangana Rising Global Summit Day 2: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ రెండో రోజు కొనసాగనుంది. తొలిరోజు సమ్మిట్ లో తెలంగాణ ప్రభుత్వం పలు సంస్థలతో కీలక ఒప్పందాలు చేసుకుంది. ఇవాళ్టి సమ్మిట్ ప్యానల్ డిస్కషన్స్ ప్రారంభం కానున్నాయి. లైఫ్ సైన్సెస్, తెలంగాణ ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్, రాష్ట్ర పర్యాటకం, సంస్కృతి, వారసత్వం, 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ దిశగా మూలధనం పెంపుపై చర్చించనున్నారు. అనంతరం గృహాలు, మూసీ పునరుజ్జీవనం, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో రవాణాపై సెషన్స్ ఉంటాయి. మధ్యాహ్నం భారత్‌ ఫ్యూచర్ సిటీ, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, గ్లోబల్ కెపాసిటీ సెంటర్లు, పీపీపీ పెట్టుబడులపై సమాలోచనలు జరపనున్నారు.

సాయంత్రం 4 గంటలకు సృజనాత్మక, వినోద రంగాలు, అందరికీ అవకాశాలు, ఆర్థిక హబ్, స్టార్టప్ లపై ప్రత్యేక సెషన్లు నిర్వహిస్తారు. దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు తరహాలో సమిట్ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. 2047 నాటికి తెలంగాణ ఎలా ఉంటుందో వివరించే దార్శనిక పత్రాన్ని తెలంగాణ రైజింగ్ వేదికపై సీఎం రేవంత్ ఆవిష్కరించనున్నారు. హుస్సేన్ సాగర్ లో వాటర్ ప్రొజెక్షన్, త్రీడీ ప్రదర్శనల ద్వారా తెలంగాణ భవిష్యత్తు, మహిళా సాధికారత, యువత, రైతు ప్రధాన కార్యక్రమాలు, మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యం వంటి అంశాలను ప్రదర్శించనున్నారు. సమ్మిట్ అనంతరం ప్రజల సందర్శనకు 3 రోజుల పాటు స్టాళ్లు అందుబాటులో ఉండనున్నాయి. రాత్రి ఏడు గంటలకు డ్రోన్ షో. ఫైర్ వర్క్స్, థీమ్ ప్రదర్శనతో ముగింపు వేడుక నిర్వహించనున్నారు.

Tags:    

Similar News