Ponnam Prabhakar: కర్నూలు ప్రమాద ఘటనపై మంత్రి పొన్నం దిగ్భ్రాంతి
Ponnam Prabhakar: కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం తీవ్ర ద్రిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్.
Ponnam Prabhakar: కర్నూలు ప్రమాద ఘటనపై మంత్రి పొన్నం దిగ్భ్రాంతి
Ponnam Prabhakar: కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం తీవ్ర ద్రిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్.. ప్రమాదంపై సీఎం రేవంత్ కూడా వివరాలు తెలుసుకున్నారని ఆయన తెలిపారు. తెలంగాణ సర్కార్ నుంచి తీసుకోవాల్సిన చర్యలు ఉంటే రవాణా శాఖ నుంచి ఆదేశించామని అన్నారు. ఏపీ రవాణామంత్రి, కర్నూలు జిల్లా కలెక్టర్ ఎస్పీలతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నాన్నారు.
భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం అన్నారు. త్వరలో ఏపీ, కర్ణాటక, తెలంగాణ రవాణా కమిషనర్లతో సమావేశం ఏర్పాటు చేస్తామని అన్నారు. స్పీడ్ లిమిట్ ప్రమాదాలను నివారిస్తూ నిబంధనలు కఠినతరం చేస్తామని ఆయన అన్నారు. బస్సులపై రోజువారీ రవాణాశాఖ తనిఖీలు చేస్తే వేధింపులు అంటున్నారు.. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్.