Komatireddy Venkat Reddy: పవన్ కల్యాణ్ వెంటనే క్షమాపణ చెప్పాలి.. లేకుంటే ఆయన సినిమాలు తెలంగాణలో ఆడవు

Komatireddy Venkat Reddy: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు.

Update: 2025-12-02 10:12 GMT

Komatireddy Venkat Reddy: పవన్ కల్యాణ్ వెంటనే క్షమాపణ చెప్పాలి.. లేకుంటే ఆయన సినిమాలు తెలంగాణలో ఆడవు

Komatireddy Venkat Reddy: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. పవన్ వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల మనోభావాలను గాయపరిచేలా ఉన్నాయని మంత్రి మండిపడ్డారు.

"తెలంగాణ ప్రజలను గాయపరిచేలా మాట్లాడాడు." "పవన్ తెలిసి మాట్లాడాడో.. తెలియక మాట్లాడాడో తెలియదు." "పవన్ కల్యాణ్ వెంటనే క్షమాపణ చెప్పాలి" అని మంత్రి కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. "లేకుంటే ఆయన సినిమాలు తెలంగాణలో ఆడవు" అని మంత్రి కోమటిరెడ్డి తీవ్రంగా హెచ్చరించారు.

పవన్ కళ్యాణ్ తన వ్యాఖ్యలకు సంబంధించి తెలంగాణ ప్రజలకు తక్షణమే క్షమాపణ చెప్పాలని, లేదంటే ఆయన చిత్రాలకు రాష్ట్రంలో అడ్డంకులు తప్పవని మంత్రి తేల్చి చెప్పారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన ఈ హెచ్చరికలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Tags:    

Similar News