Harish Rao On Plasma Donation: ప్లాస్మా దానానికి ముందుకు రావాలి: మంత్రి హరీష్ రావు

Harish Rao On Plasma Donation: కరోనా నుండి కోలుకున్న వారు ప్లాస్మా దానం చేయాలంటూ మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు.

Update: 2020-08-28 15:21 GMT

 Harish Rao (File Photo)

Harish Rao On Plasma Donation: కరోనా నుండి కోలుకున్న వారు ప్లాస్మా దానం చేయాలంటూ మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. మూడు సార్లు ప్లాస్మా దానం చేసిన సిద్దిపేట కానిస్టేబుల్ శేఖర్ పై ప్రసంసల వర్షం కురిపించారు. 'మూడు సార్లు ప్లాస్మా దానం చేసిన నీ పెద్ద మనస్సు అందరికీ ఆదర్శం. కరోనా పట్ల ప్రజల్లో ఉన్నఅపోహలను నీలాంటి యువకులే తొలిగించాలి. దానానికి ముందుకు రావాలని. తెలంగాణ సమాజం నిన్ను చూసి గర్విస్తుంది'. అంటూ హరీష్ రావు ట్వీట్ చేసారు. ప్లాస్మా దానానికి యువకులు ముందుకు రావాలని సూచించారు.

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. నిన్న రాత్రి 8 గంటల వరకు కొత్తగా 2,932 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. 11 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,17,415కి చేరింది. మృతుల సంఖ్య 799కి పెరిగింది. మరోవైపు నిన్న1580 మంది కోలుకోగా.. ఇప్పటి వరకూ డిశ్చార్జి అయిన వారి సంఖ్య 87,675కి చేరింది.

ప్రస్తుతం 28,942 మంది చికిత్స పొందుతున్నారు. హోం ఐసోలేషన్‌లో 22,097 మంది ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. తెలంగాణలో కరోనా మరణాల రేటు 0.68 ఉందని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కోలుకున్న వారి రేటు 75.2కు చేరుకుంది. జీహెచ్ఎంసీలో - 520, కరీంనగర్- 168, ఖమ్మం 141, మహబూబాబాద్- 67మంచిర్యాల- 110, మేడ్చెల్- 218, నల్గొండ- 159, నిజామాబాద్- 129, రంగారెడ్డి- 218, సిద్దిపేట- 100 వరంగల్ అర్బన్- 80 కేసులు నమోదయ్యాయి.



Tags:    

Similar News