TGSRTC strike: తెలంగాణ ఆర్టీసీ జేఏసికి, ఆర్టీసీ యాజమాన్యంతో చర్చలకు పిలుపు

Update: 2025-02-07 12:06 GMT

TGSRTC offers: ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ అదిరిపోయే గుడ్ న్యూస్.. టికెట్ల ధరలు భారీగా తగ్గింపు

TGSRTC strike latest news: తెలంగాణ ఆర్టీసీ జేఏసి ఇచ్చిన సమ్మె నోటీసులపై కార్మిక శాఖ స్పందించింది. జనవరి 27న టిజీ ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఈ సమ్మె నోటీసులపై కార్మిక శాఖ స్పందిస్తూ అటు ఆర్టీసీ జేఏసికి, ఇటు ఆర్టీసీ యాజమాన్యాన్ని చర్చలకు రావాల్సిందిగా ఆహ్వానించింది. ఈ నెల 10న సోమవారం నాడు చర్చలు జరపనున్నట్లు కార్మిక శాఖ వెల్లడించింది.

ఆర్టీసీ యాజమాన్యం నుండి ఆర్టీసీ ఉద్యోగ జేఏసీ కోరుతున్న 21 డిమాండ్స్ పై కార్మిక శాఖ చర్చించనుంది. ఆర్టీసీ ఉద్యోగ జేఏసి ఇచ్చిన గడువు ఫిబ్రవరి 9వ తేదీతో ముగియనుంది. ఆ లోగా ఆర్టీసీ యాజమాన్యం స్పందించకపోతే ఆ తరువాత తాము సమ్మెకు దిగుతామని ఆర్టీసీ జేఏసీ హెచ్చరిస్తూ వస్తోంది. ఈ కారణంగానే ఫిబ్రవరి 10న వారి సమస్యలపై చర్చించి వాటి పరిష్కారానికి కృషి చేసేందుకు కార్మిక శాఖ ముందుకొచ్చినట్లు తెలుస్తోంది.

ఆర్టీసీలో రిటైర్మెంట్ అవుతున్న వారి స్థానంలో కొత్త వారిని తీసుకోవడం లేదని ఆర్టీసీ జేఏసి చెబుతోంది. పాత వారి స్థానంలో కొత్త వారిని తీసుకోకపోవడం వల్ల ఉన్న కొద్దిమంది సిబ్బందిపైనే అధిక పనిభారం పడుతోందంటున్నారు. ఎక్కువ పని గంటలు పనిచేయడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటోందని ఆర్టీసి సిబ్బంది వాపోతున్నారు.

ఒకవైపు ఆర్టీసీ యాజమాన్యం కొత్త బస్సులు కొనడం లేదని, మరోవైపు కొనే కొన్ని బస్సులు కూడా ప్రైవేట్ బస్సుల కిందే తీసుకుంటూ ఆర్టీసీనీ ప్రైవేటీకరణ చేసేందుకు యత్నిస్తున్నారని ఆర్టీసీ జేఏసి ఆరోపిస్తోంది. ఇలాంటి సమస్యలే కాకుండా ఇప్పటికే పెండింగ్ లో ఉన్న ఫిట్మెంట్, డిఏ సమస్యలు ఇంకెన్నో ఉన్నాయని ఆర్టీసీ ఉద్యోగులు చెబుతున్నారు. 

Tags:    

Similar News