Telangana IPS Transfers: తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు
Telangana IPS Transfers: తెలంగాణ పోలీస్ శాఖలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో 20 మంది ఐపీఎస్‌లకు స్థానచలనం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Telangana IPS Transfers: తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు
Telangana IPS Transfers: తెలంగాణ పోలీస్ శాఖలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కమిషనరేట్లు మరియు కొత్తగా ఏర్పాటైన జోన్లకు సంబంధించి భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 20 మంది ఐపీఎస్ అధికారులకు స్థానచలనం కల్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ రావు ఉత్తర్వులు వెలువరించారు.
20 మంది ఐపీఎస్‌ల బదిలీ, పోస్టింగ్‌లు
1. HYD సౌత్ రేంజ్ అదనపు కమిషనర్‌గా తస్వీర్ ఇక్బాల్ నియామకం
2. HYD నార్త్‌రేంజ్ జాయింట్ కమిషనర్‌గా శ్వేత
3. హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ జాయింట్ కమిషనర్‌గా విజయ్‌కుమార్
4. కుత్బుల్లాపూర్ జోన్ డీసీపీగా కోటిరెడ్డి
5. ఫ్యూచర్ సిటీ మహేశ్వరం జోన్ డీసీపీగా నారాయణ్‌రెడ్డి
6. సికింద్రాబాద్ జోన్ డీసీపీగా రక్షిత మూర్తి
7. ఉప్పల్ జోన్ డీసీపీగా సురేష్‌కుమార్
8. చార్మినార్ జోన్ డీసీపీగా కారే కిరణ్
9. ఎల్బీనగర్ డీసీపీగా అనురాధ
10. చేవెళ్ల డీసీపీగా యోగేష్ గౌతమ్
11. కూకట్‌పల్లి డీసీపీగా రితిరాజ్
12. శేరిలింగంపల్లి డీసీపీగా చింతమనేని శ్రీనివాస్
13. సిద్దిపేట సీపీగా రేష్మి పెరుమాళ్
14. మల్కాజ్‌గిరి డీసీపీగా సీహెచ్ శ్రీధర్
15. ఖైరతాబాద్ డీసీపీగా శిల్పవల్లి
16. రాజేంద్రనగర్ డీసీపీగా ఎస్ శ్రీనివాస్
17. గోల్కొండ జోన్ డీసీపీగా చంద్రమోహన్
18. జూబ్లీహిల్స్ జోన్ డీసీపీగా రమణారెడ్డి
19. శంషాబాద్ జోన్ డీసీపీగా బి. రాజేష్
20. షాద్‌నగర్ జోన్ డీసీపీగా శిరీష