విద్యార్థులెవరూ సొంతూళ్లకు వెళ్లొద్దు: హోంమంత్రి

కరోనా వ్యాప్తిని కట్టడి చేయడానికి లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. దీంతో రవాణా వ్యవస్త ఎక్కడి కక్కడ స్థంబించిపోయింది.

Update: 2020-03-26 12:26 GMT
Home Minister Mohammed Ali (file photo)

కరోనా వ్యాప్తిని కట్టడి చేయడానికి లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. దీంతో రవాణా వ్యవస్త ఎక్కడి కక్కడ స్థంబించిపోయింది. సరిగ్గా ఇదే సమయానికి హైదరాబాద్ నగరంలోని కొన్ని హాస్టల్ల నిర్వహకులు హాస్టల్లలో ఉండే విద్యార్థులను వెంటనే ఖాలీ చేసి వెల్లిపోవాలని, బలవంతంగా ఖాలీ చేయిస్తున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఎటూ దిక్కుతోచని విద్యార్థులు వందల సంఖ్యలో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. సమయానికి సరైన ఆహారం దొరక్క సతమతమవుతున్నారు. దీంతో విద్యార్థులు తమ గ్రమాలకు వెల్లాలని నిర్ణయించుకుని పెద్దఎత్తున పోలీస్ స్టేషన్ల ముందు నిలుచున్నారు. తమకు పాస్‌లు ఇవ్వాలని మేము మా వెలతామని ఆయా పోలీసు స్టేషన్లలో విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో వారి బాధను చూడ లేక పోలీసులు బుధవారం పాసుల జారీ చేసారు.

కాగా దేశమంతటా లాక్ డౌన్ ఉండడం వలన ఒక ప్రాంతం వారిని, మరో ప్రాంతానికి రానివ్వడం లేదు. దీంతో విద్యార్ధులు రెండు రాష్ట్రాల బార్డర్ వద్ద పడిగాపులు గాస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న తెలంగాణ హోమంత్రి మహమూద్ అలీ స్పందించారు. విద్యార్థులకు ఇచ్చే ఎన్ఓసీలను పూర్తిగా నిలిపేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటి వరకూ తెలంగాణలో లాక్ డౌన్ ప్రశాంతంగా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేసారు. హాస్టల్ విద్యార్థులకు ఎవరినీ బయటికి పంపించకూడదని హాస్టల్ నిర్వహకులను ఆదేశించారు. వారికి వావలసిన సౌకర్యాలను ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు. హాస్టల్ నిర్వహకులు నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి హెచ్చరించారు. హాస్టల్స్‌లో ఉణ్న విద్యార్థులెవరూ సొంతూళ్లకు వెళ్లొద్దని సూచించారు.

ఇక అత్యవసర విభాగాల్లో విధులకు హాజరయ్యే వారికి పాసులకు ఇవ్వాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే కమిషనర్ అంజనీకుమార్ పాసులు జారీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ నగరానికి సంబంధించి ఇప్పటివరకు 900 పాసులు ఇచ్చామని సీపీ అంజనీకుమార్ తెలిపారు. పాసులు కావాలను కున్న వారు ఆన్‌లైన్‌లో covid19.hyd@gmail.com ద్వారా వినతులు పంపాలి. లేకపోతే 94906 16780 నంబరుకు వాట్సప్‌లోనూ మెస్‌జ్ రూపంలో పంపొచ్చని తెలిపారు.

Tags:    

Similar News