Telangana: నేటి నుంచి తెలంగాణలో ఉన్నత విద్యాసంస్థలు బంద్
Telangana: తెలంగాణలో ఇవాళ్టి నుంచి ఉన్నత విద్యాస్స్థలు నిరవదిక బంద్ పాటించనున్నాయి.
Telangana: నేటి నుంచి తెలంగాణలో ఉన్నత విద్యాసంస్థలు బంద్
Telangana: తెలంగాణలో ఇవాళ్టి నుంచి ఉన్నత విద్యాస్స్థలు నిరవదిక బంద్ పాటించనున్నాయి. ఫీజు రీయింబర్స్ మెంట్ పై యాజమాన్యాలు నిర్ణయం ప్రకటించాయి. పాలిటెక్నిక్, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, పార్మసీ, నర్సింగ్, లా, మేనేజ్మెంట్ , బీఈడీ ప్రైవేట్ కాలేజీలు మూసి వేస్తున్నట్టు విద్యాసంస్థల సంఘాల సమాఖ్య ప్రకటించింది.
ప్రైవేట్ కళాశాల యజమాన్యాలు చేస్తున్నా ఆందోళన నేపథ్యంలో డీప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క అర్దరాత్రి వరకు చర్చలు జరిపారు. నాలుగేళ్లుగా ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించడం లేదని సమ్మె బాట పడుతున్నట్టు చెప్పారు. ఇప్పటికే టోకెన్లు ఇచ్చిన 12 వందల కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులను దసరా లోపు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఫార్మసీ, బీఈడీ, ఇంజినీరింగ్ పరీక్షలు వాయిదా వేశారు. ఇవాళ మధ్యాహ్నం మరోసారి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు చర్చలు జరపనున్నారు. కాలేజీల సమస్యలపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందని భట్టి చెప్పారు. సమ్మె విరమించాలని కళాశాలల యాజమాన్యాలను కోరారు.
ప్రైవేట్ కళాశాల యజమానుల సమస్యలపై నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు. చర్చలు సానుకూలంగా కొనసాగాయని ప్రైవేటు కళాశాలల సమస్యలను అర్థం చేసుకున్నమని భట్టి విక్రమార్క అన్నారు. వారి సమస్యలపై ప్రభుత్వ పరంగా ఒక నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అప్పటివరకు సమ్మెను విరమించమని డీప్యూటీ సీఎం కళాశాలల యజమానులను కోరారు.